టీడీపీ నేతల్లో శుక్రవారం టెన్షన్ టెన్షన్…

ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే రకం జగన్ కాదని ఆయనను ఎరిగిన వారెవరైనా చెబుతారు. నాడు కేసులతో ఆయనను పలు రకాలుగా టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. శుక్రవారం వస్తుందంటేనే ఆయనపై సెటైర్లు మామూలుగా పడేవి కావు. అయితే అప్పట్లో చంద్రబాబు ప్రతి నిర్ణయం యూ టర్న్ తీసుకున్నట్లు ఇప్పుడా సెటైర్లన్నీ యూటర్న్ తీసుకుంటున్నట్టుగా పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది.

ఈఎస్‌ఐ కేసులో టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్టైంది.. శుక్రవారం రోజే.. తాజాగా గుంటూరులో జరిగిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా శుక్రవారం రోజే అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతుందని… మరికొందరు టీడీపీ నేతలు పలు కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారని సమాచారం. మరి ఆ అరెస్టులు కూడా శుక్రవారం రోజే జరుగుతాయా? లేదో వేచి చూడాలి. నిజానికి ఇవి యాధృచ్చికంగా జరిగి ఉండవచ్చేమో కానీ.. ఇద్దరూ వేర్వేరు తేదీల్లో ఒకే వారం అరెస్ట్ అవడం మాత్రం గమనార్హం.మొత్తానికి శుక్రవారం వస్తుంది అంటే టీడీపీ నేతల్లో దడ పుట్టిస్తోంది అని మీడియా వరాల్గాలో సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here