మహేష్ – ఎన్టీఆర్ – ప్రభాస్ ముగ్గురిలో ఎవరు ఇష్టం అంటే నాగబాబు చెప్పిన మాట ఇది

మెగా ఫ్యామిలీ లో హీరోలకి కొదవ లేదు .. పవన్ కల్యాణ్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. అల్లు శిరీష్ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నాగ బాబు కూడా ఒకప్పుడు హీరోగా ట్రై చేసినా వర్క్ అవ్వక ప్రస్తుతం బుల్లి తెరకి పరిమితం అయ్యారు. నిర్మాతగా కూడా ఒకప్పుడు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన ఆయన ఇప్పుడు మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి వారి గురించి చేసిన వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నాగబాబు కి మెగా ఫామిలీ లో కాకుండా ఎన్టీఆర్ , మహేష్ , ప్రభాస్ ముగ్గురిలో ఎవరు ఇష్టం అని అడిగినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఆసక్తిగా ఉంది. మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. ప్రభాస్ అంటే తనకి ఎంతో ఇష్టమని నాగబాబు అన్నారు. హీరోలుగా వాళ్లు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతగా శ్రమించారనేది తనకి తెలుసని చెప్పారు. ఎంతో డబ్బు ఉన్నా కూడా సినిమా మీద ఉన్న ప్రేమతోనే వారు కష్టపడుతున్నారు అన్ని నాగబాబు గుర్తు చేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here