భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు..

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.

కాగా, తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,148 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిందిదీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,04,641కి చేరుకుంది. అలాగే కరోనా ప్రభావంతో 434 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 17,834కి పెరిగింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుండి 3,59,859 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 2,26,947 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here