ఆ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు..

బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి అలర్ట్. న‌గ‌దు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవ‌స‌రం. బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ నెల (జూలై)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూలై నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 4, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే జూలై నెల‌లో వ‌చ్చే నాలుగు ఆదివారాలు 5, 12, 19, 26 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here