ప్రతిపక్ష పాత్ర కోసం చంద్రబాబు పోరాటం

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం విషయంలో ఏమాత్రం అవకాశం దొరికినా అది ఎంతటిదైనా వదలకుండా ట్వీట్స్ పోటీపడి మరీ కురిపించేస్తున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. అయితే ఆ ట్వీట్స్ లోని విషయాన్ని బట్టి కొన్ని సార్లు నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా చంద్రబాబు వేసిన ట్వీట్ కి ప్రభుత్వం వెంటనే స్పందించింది. దానికి గూబ పగిలిపోయే రీట్వీట్ చేపడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో అసలు చంద్రబాబు మరీ ఇంత దిగజారుగుడుగా వ్యవహరిస్తున్నారా అని తమ్ముళ్లు వాపోతున్నారు. బాబుకి కరోనా గాలిసోకిందా ఏమిటి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదేమంటే… ఏపీలో కరోనా టెస్టుల లెక్కలన్నీ మాయ అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా టెస్టులు చేయించుకోని వాళ్లకు కూడా రిజల్ట్ గురించి ఎస్సెమ్మెస్ లు వస్తున్నాయన్న సిల్లీ విషయాన్ని కూడా చంద్రబాబు ఓ ఫిర్యాదులా “కేంద్రం పట్టించుకోవాలి” అంటూ ట్వీట్ చేసి రచ్చ చేశారు. దమ్మున్న ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకుడి వలే చంద్రబాబు ఉండటంతో రాష్ట్ర ప్రజానీకమంతా హర్షిస్తోంది. అయితే ఈ చంద్రబాబు ట్వీట్ కు ఏపీ సర్కారు షార్ప్ గా స్పందించింది. వెంటనే చంద్రబాబు ట్వీట్ కు రీట్వీట్ చేసి షాక్ ఇచ్చింది.

ఏపీ సర్కార్ కరోనా పరీక్ష చేయించుకున్న వ్యక్తి సంబంధిత అధికారులకు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ ఫోన్ నెంబర్ కే ఫలితాలతో కూడిన ఎస్సెమ్మెస్ వెళ్తుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ కరోనా టెస్టులు చేయించుకున్న వ్యక్తి తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినా.. లేక మరొకరి నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ కే ఎస్సెమ్మెస్ వెళ్తుందని వివరించింది. కరోనా టెస్టుల ఫలితాలను వెంటనే తెలియజేసి ప్రజల్లో భయాందోళనలు తగ్గించడానికి వీలుగా సత్వర ఉపశమనం పొందేందు కోసం ఈ ఎస్సెమ్మెస్ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఒక మిలియన్ సందేశాల్లో ఏవో కొన్ని సందేశాలను తప్పుబట్టడం, అది కూడా ప్రభుత్వం వైపు నుంచి పొరబాటు లేకపోయినా ప్రభుత్వాన్ని తప్పు పడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కీలక సమయంలో సరైన పద్ధతి అనిపించుకోదని సర్కార్ స్పష్టం చేసింది. మొత్తానికి ఇది చంద్రబాబుకి ప్రభుత్వమిచ్చిన ఘాటు రిప్లైగానే చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here