నేను మీ మగాళ్ళ అందరి ప్రాపర్టీని అనుకోకండి : ఇలియానా

ఈ మధ్య కాలం లో సినిమాలు లేక సతమతం అవుతున్న హీరోయిన్ ఇలియానా ఇప్పుడు కాస్తంత సీరియస్ అయ్యింది. ఎక్కువగా తన సినిమాల విషయం పక్కన పెట్టేస్ అండ్రూ నీబోన్ గురించి అడుగుతున్నారు అని ఆమె చిర్కు పడింది.ట్విట్టర్ ఖాతా లో తన గోడు చెప్పుకుంది ఆమె. తనని ఈ విషయం చాలా బాధపెడుతోంది అనీ తాను పబ్లిక్ ఫిగర్ ని మాత్రమె తప్ప పబ్లిక్ ప్రాపర్టీ ని కాదు అని కొంతమంది అర్ధం చేసుకోవాలని ఆమె క్లాస్ పీకింది. తానూ అమ్మాయినేనని, మీ ఇంట్లో ఆడవాళ్లకు ఇచ్చే గౌరవాన్ని తనకెందుకు ఇవ్వరని ప్రశ్నించిన ఇలియానా, ఆండ్రూ గురించి ఒకసారి ప్రశ్నిస్తే తప్పులేదని, పదేపదే ఒకే ప్రశ్న ఎదురవుతోందని చెప్పుకొచ్చింది. అతను తెల్లగా ఉన్నాడు కాబట్టి తాను డేటింగ్ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం నచ్చడం లేదని తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here