నమ్మండి ప్లీజ్….నాకు కరోనా లేదు

తను హోం ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పుకుంది యాంకర్ ఝాన్సీ. ఎవ్వర్నీ కలవడం లేదని, మందులు కూడా వేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. అయితే చాలామంది ఈ మేటర్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆమెకు కరోనా సోకిందని అనుకున్నారు. తనకు కరోనా సోకలేదనే విషయాన్ని ఆల్రెడీ ప్రకటించిన ఈ సీనియర్ యాంకర్.. ఈసారి నేరుగా తనే మీడియా ముందుకొచ్చింది. ఓ వీడియో రిలీజ్ చేసి పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.

ఆమధ్య ఓ కార్యక్రమం చేసిందట ఝాన్సీ. తన యూనిట్ లో ఉన్న ఇద్దరికి కరోనా సోకిందట. దీంతో ముందుజాగ్రత్తగా తను కూడా హోం ఐసోలేషన్ లో ఉండి మందులు వేసుకుందట. అంతే తప్ప, ఇప్పటివరకు తను కరోనా పరీక్ష కూడా చేయించుకోలేదని చెబుతోంది. ఆల్రెడీ వారం రోజులు గడిచిపోయాయని, రేపోమాపో కరోనా పరీక్ష చేయించుకుంటానని చెబుతోంది.

ప్రస్తుతం తనకు ఎలాంటి లక్షణాలు లేవని, లక్షణాలు లేకపోయినా తనకు పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే, ఆ విషయాన్ని కూడా ఇలా వీడియో రూపంలో రిలీజ్ చేస్తానని, అంతే తప్ప పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తోంది ఝాన్సీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here