కరోనా వైరస్ తో సీఎం పీఏ మృతి ..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. వైరస్ భారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. సామాన్యుల నుండి విఐపిలు ప్రముఖులు ఇలా తేడా లేకుండా అందరూ వైరస్ భారిన పడుతున్నారు.

తాజాగా తమిళనాడు సీఎం పీఏకి వైరస్ సోకినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

తమిళనాడు సీఎం పళని స్వామి పీఏ దామోదరం నేడు కరోనా వైరస్ తో మృతి చెందినట్లు రాష్ట్ర అధికారులు  చెప్పారని ప్రచారం జరుగుతుంది

ఇండియాలో కరోనా వైరస్ విజృంభణ  చేస్తోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 10974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 354065కి చేరింది.

కాగా కరోనా వైరస్  మరణాలు సంఖ్య కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే 2003 మంది వైరస్  కారణంగా చనిపోయారు

దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 11903కి చేరింది. డెత్ రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం గమనార్హంకాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 186934గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here