కరోనాతో ఇస్కాన్ చీఫ్ కన్నుమూత..!

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి లక్షల మంది మరణిస్తున్నారు. తాజాగా..ఈ మహమ్మారి బారిన పడి ఇస్కాన్ అధిపతి భక్తి చారు మహారాజ్ మరణించారు. ఆయన తరచూ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఇస్కాన్ ఆలయానికి వచ్చి ఇక్కడ గడిపేవారు.

గత నెల 3 న ఉజ్జయిని నుంచి అమెరికా వెళ్లి.. జూన్ 18 న తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా.. కరోనా వైరస్‌ పరీక్షలు జరిపి పాజిటివ్ అని తేల్చారు. దీంతో భక్తి చారు మహారాజ్ ని అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక ఆసుపత్రిలో చేర్పించారు.

గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. ఆయనని వెంటిలేటర్‌ లో ఉంచారు. కాగా, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. భక్తి చారు మహారాజ్ రెండుసార్లు ఇస్కాన్ పాలకమండలి కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here