కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తున్న హీరో సునీల్

సునీల్ ఇప్పుడు ఉంగరాల రాంబాబు సినిమా తో బిజీగా వున్నాడు.. కమెడీయన్ గా వచ్చి హీరోగా ఎదిగిన సునీల్ తక్కువ టైంలోనే మంచి ఫామ్ లోకి వచ్చాడు..అలాంటి సునీల్ కు హీరోగా ఇప్పుడు అసలు కలసి రావటం లేదు.. ఏ సినిమా చేసిన ప్లాప్ అవ్వటంతో ఇక సునీల్ హీరోగా పనికి రాడు, మళ్ళీ కమెడీయన్ గా రీ ఎంట్రీ ఇవ్వటం తప్పదనుకుంటున్న టైంలో సునీల్ కూడ కమెడీయన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ పుకార్లుషికార్లు చేసింది.
చిరు 150 వ సినిమాలో ,  ఆతర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా లో ఛాన్స్ వచ్చిన అది కూడ కాదన్నాడు..అయితే ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మళ్ళీ సునీల్ కమెడీయన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రూమర్ ను సునీల్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఉంగరాల రాంబాబుతో భీమవరం బుల్లోడు తన స్టామీనా ఏంటో నిరూపించుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here