ఆమిర్ కీ షారూఖ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు, స్టిల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ నెమ్మదిగా తన జోరు పెంచుతున్నాడు. ఈ సంవత్సరం అతనివి రెండు సినిమాలు రాబోతున్నాయి. కబీర్ ఖాన్ డైరెక్షన్ లో సల్మాన్ చేస్తున్న ట్యూబ్ లైట్ సినిమా రాబోతోంది అగస్ట్ లో ఇందులో షారూఖ్ ఖాన్ ప్రత్యేక పాత్ర చేస్తూ ఉండగా 1962 నాటి ఇన్దిఆ చైనా యుద్ధ నేపధ్యం లో మరొక పీరియాడికల్ సినిమా కి సల్లూ సంతకం పెట్టాడు. చైనా హీరోయిన్ జూజూ తో సల్మాన్ ఈ సినిమాలో రోమాన్స్ చెయ్యబోతున్నాడు. ఈ చిత్రం రంజాన్ కి తీసుకుని రావాలి అని చూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయిపోవడం తో మరొక చిత్రం కోసం ఆస్ట్రియా లో షూట్ చేస్తున్నారు. ఏక్ థా టైగర్ అనే సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. టైగర్ జిందా హై అనే పేరు మీద రూపొందిన సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదేమో క్రిస్టమస్ కి రావచ్చు అంటున్నారు. ఇప్పటికే మూడు సినిమాల విడుదల తేదీకి ఖరారు చేసుకుని షారూఖ్ ,ఆమిర్ లకి షాక్ ఇచ్చాడు మనోడు. ఏడాదికి ఒక్క సినిమానే తేవలట్లేదు మిగితా ఇద్దరికీ కానీ సల్లూ ఒకే ఏడాదిలో మూడట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here