గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ వివాదం ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీరెడ్డి తెలుగు సినిమా రంగంలో ఉన్న స్టార్ హీరోలపై దర్శకులపై నిర్మాతలపై చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఇటీవల మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో శ్రీరెడ్డి సహా కొందరు మహిళా అధ్యక్షులు, కారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ విషయమై శ్రీరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని, అన్న మీరు ఒక ఆడపిల్ల బయటకి వచ్చి అర్ధ నగ్న ప్రదర్శన చేసిందంటే ఆమె మనసులో ఎంత ఆవేదన ఉందొ అందరికి అర్ధమవుతుంది, మీకు ఎంతో గొప్ప పేరు వుంది, ప్రస్తుతం మీరు ఒక పార్టీ కి అధినేత కూడా, అందువల్ల మీరు మా లాంటి వాళ్ళ బాధలు తెలుసుకుని మాట్లాడమని అడిగింది.
అయితే తర్వాత కొందరు మీడియా వారు ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ న్ని ప్రశ్నించగా శ్రీ రెడ్డి చేస్తున్న ఆందోళనలు కరెక్ట్ కాదని అన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ లు చట్టసభలు ఉన్నాయని ఆలోచన చెప్పాడు పవన్. దీంతో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ ని అన్న అని ఇకపై సంబోధించనని, అందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని అన్నారు. అంతే కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కు ఏమితెలుస్తుంది ఆడవాళ్ళ సమస్యలు అని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో మెగా కుటుంబం నుండి నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా మండిపడ్డారు. ఇండస్ట్రీలో అందరూ నీకు లాగా ఉండారని తీవ్రంగా స్పందించారు.