2019 ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంటుంది: వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి

వైసీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  వచ్చే ఎన్నికలలో కచ్చితంగా వైయస్సార్సీపి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ రాష్ట్రంలో చేసిన అభినేత్రి కార్యక్రమాలు బయటకు తీసి చంద్రబాబు…లోకేష్ కు సహకరించిన అధికారుల పైన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. అంతేగాక అదికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

వీరి విషయంలో జగన్‌ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇన్నాళ్ళు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని చెప్పిన చంద్రబాబు..ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here