అసలే మంత్రి వర్గ విస్తరణ లో చోటు దక్కలేదు. పైగా మంత్రి వర్గ విస్తరణ లో అందరికీ మంత్రి పదవి ఇస్తాను అని నేనేమైనా చెప్పనా ? అసలు అలా ఎలా అనుకున్నారు అంటూ చంద్రబాబు రివర్స్ లో ప్రశ్నించడం టీడీపీ లో చాలా మంది సీనియర్ లకి కోపం తెప్పించింది అంటున్నారు, ఆయన తీరు మీద ఆయన వ్యవహార శైలి మీద కోపంగా ఉన్నారు అందరూ. ఉండవల్లి లో తూర్పు గోదావారి టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు బాబు. దీనికి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య రాలేదు.
చంద్రబాబు స్వయంగా ఆయన పేరు చెప్పి మరీ బుచ్చయ్యకు పదవి వస్తుందని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. అసలు మంత్రి పదవి వస్తుందని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎలా భావిస్తారని బాబు ప్రశ్నించారు. కమ్మ అయిన బుచ్చయ్య కి తన సామాజిక వర్గం వారు ఇప్పటికే క్యాబినెట్ లో ఎక్కువగా ఉన్నారు అన్న ఐడియా లేదా అంటూ సీరియస్ అయ్యారు.
ఇంకా యనమల , నెహ్రూ ల పైన కూడా బాబు సీరియస్ అయ్యారు అట. టీడీపీ నాయకుల మధ్యన సమన్వయం ఉండడం లేదు అంటూ కోప్పడ్డారు. పదవులు ఇవ్వడం మానేసి ఇంకా రివర్స్ లో తమని తిట్టడం ఏంటి అంటూ చంద్రబాబు మీద సీరియస్ గా ఉన్నారు సీనియర్ లు.