ఒక సినిమా ఫస్ట్ లుక్ నుంచీ టీజర్ వరకూ విడుదల ఎక్కడా సినిమా లో ఉండే అసలైన థీం ని చెప్పకుండా ఉంచాలనే చూస్తారు . ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవ కుశ లోగో లుక్ రిలీజ్ ని శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టి నాలుగు వారాలు అవ్వలేదు అప్పుడే లోగోనా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. లోగో లుక్ ని డిజైన్ చెయ్యడానికే టైం పడుతుంది కానీ శ్రీరామనవమి కారణంగా లోగో ఇవ్వాలి అనుకుని మంచి అవుట్ పుట్ తో విడుదల చేసారు.
సినిమా థీమ్ మొత్తం ఈ లోగో టైటిల్ లోనే తెలిసేలా చేసారు డైరెక్టర్. దేవుడైన రాముడు పేరుతో రావణుడు ని అంతం చేయడం కనిపిస్తుంది. కమర్షియల్ థీం తోనే ఈ సినిమా సాగుతుంది అని పూర్తిగా చూపించారు. రౌడీ లనీ విలన్స్ ని హీరో నరుక్కుంటూ పోతాడు అనేది ప్రతీ సినిమాలో కాన్సెప్ట్ ఇందులో కూడా అంతే తప్ప కొత్తదనం లేదు అన్నట్టు ఉంది ఆ థీం.