లేడీ సింగంకు అభినందనలు..యోగి ప్రభుత్వంపై పేలుతున్న సెటైర్లు

 లేడీ సింగం…. యూపీ పోలీసాఫీసర్‌ శ్రేష్ట ఠాగూర్‌పై బదిలీ వేటు పడింది. అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే… పరిస్థితి ఎలా ఉంటుందో… యోగి సర్కార్‌ చేసి చూపించింది. నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వర్తించినందుకు నేపాల్‌ బోర్డర్‌లోని ఓ మారుమూల ఏరియాకి బదిలీ చేసింది. అయితే బదిలీని కూడా టేకిటీజీగా తీసుకున్న శ్రేష్ట ఠాగూర్‌…. సోషల్‌ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి.
మా వాహనాలనే ఆపుతావా? మమ్మల్నే తనిఖీ చేస్తావా అంటూ చిందులేసిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు చుక్కలు చూపించడమే కాకుండా, ఐదుగుర్ని జైలుకు పంపి, తన ధైర్యసాహసాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌, ఆడ సింగం…. శ్రేష్ట ఠాగూర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు.
ఆర్సీ లేదు… హెల్మెట్‌ లేదంటూ బీజేపీ లీడర్లను నడిరోడ్డుపై దుమ్ముదులిపేసిన లేడీ సింగంపై వేటు పడింది. అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే… పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి కూడా నిజాయితీగా విధులు నిర్వహించిన లేడీ పోలీసాఫీసర్ శ్రేష్ట ఠాగూర్‌పై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బదిలీ వేటేసింది. ఘటన జరిగి సరిగ్గా వారం రోజులు తిరక్కుండానే బదిలీ ఉత్తర్వుల్ని చేతిలో పెట్టింది. నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వర్తించినందుకు పనిష్మెంట్‌ కింద నేపాల్‌ బోర్డర్‌లోని ఓ మారుమూల ఏరియాకి విసిరేశారు.
 బదిలీ వేటుపడినా శ్రేష్ట ఠాగూర్‌ మాత్రం తన ధైర్యాన్ని కోల్పోలేదు. పైగా బదిలీ చేయించినవారిని, చేసిన వారిని ఉద్దేశించి ఘాటుగా స్పందించింది. నేను బదిలీ అయ్యాను… ఫీలింగ్‌ హ్యాపీ…. నేను సంతోషంగానే ఉన్నాను… ఇది నా పనితీరుకు దక్కిన గుర్తింపు… ఒక జ్వాలకు సొంత ఇల్లంటూ ఉండదు…. అది ఎక్కడికి వెళ్లినా వెలుతురును వ్యాపింపజేస్తుంది…. డోన్డ్‌ వర్రీ మై ఫ్రెండ్స్… అంటూ సోషల్‌ మీడియాలో శ్రేష్టా….. పెట్టిన పోస్టింగ్‌… ఇప్పుడు సంచలనంగా మారాయి.
 మరోవైపు యోగి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. స్వచ్ఛమైన, నీతివంతమైన, పారదర్శక పాలన అందిస్తానంటోన్న యోగీ కూడా అందరిలాగే ఓ సాదాసీదా ముఖ్యమంత్రేనని… అతనిలో ఎలాంటి ప్రత్యేకతా లేదని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here