జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో గురించి ఇప్పుడు ఫాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా తెగ మాట్లాడు కుంటున్నారు. ఎన్టీఆర్ తనదైన శైలి లో కన్ను గీటుతూ విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతంగా ఫేమస్ అయ్యింది. ఒకటి రెండు నెలల్లో షూటింగ్ కూడా మొదలు అవ్వడానికి సర్వం సిద్దమైంది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రాబోతున్న ఈ షో మొదటి ఎపిసోడ్ లు ముంబై లో జరగా బోతున్నాయి. ముంబై ఫీనిక్స్ మాల్ దగ్గర ఉన్న ప్రముఖ స్టూడియో లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఇలా హైదరాబాద్ లో కాకుండా షూట్ ముంబై లో జరగాలి అనేది ఎన్టీఆర్ పెట్టిన షరతు గా చెబుతున్నారు. తన బుల్లి తెర ఎంట్రీ చాలా క్లాసీ గా ఉండాలి అని ఫీల్ అయిన ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సాక్షిగా ముంబై స్టూడియో లో షూట్ జరగాలి అని షరతు పెట్టాడట. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం బోలెడు పారితోషికం ముట్ట చెప్తున్న మాటీవీ వారికి ఈ కొత్త షరతు షాకింగ్ ఏ మరి.