బాహుబలి దెబ్బకి భయపడిన శంకర్ ? రోబో 2 మీద నమ్మకం లేక ఈ షాకింగ్ నిర్ణయం

రోబో సీక్వెల్ గా రాబోతున్న రోబో 2 కి ఎనభై కోట్ల వరకూ ధర పలికింది అని చెబుతున్నారు. ఒక ప్రాంతీయ చిత్రానికి ఈ రేంజ్ లో రేటు రావడం అన్నది చాలా గొప్ప విషయం అని ఒప్పుకోవాల్సిందే. కానీ అక్షయ్ కుమార్ మెయిన్ విలన్ గా ఉన్న సినిమా హిందీ లో ఆ మాత్రం ధర పలకడం గొప్పా ? అని ఆలోచించుకోవాలి ప్రొడ్యూసర్ లు. అలాగే బాహుబలి 2 రేంజ్ ని బట్టి చూసుకుంటే హిందీ లో రోబో 2 ధర పెద్ద గొప్పేమీ కాదు. హిందీలో ఇంతవరకు ఏ సినిమా సాధించని ఫీట్లు కేవలం అనువాద వెర్షన్‌తోనే బాహుబలి సాధించింది.

కేవలం హిందీ డబ్బింగ్ వెర్షన్ బాహుబలి 2 చిత్రమే రెండు వందల యాభై కోట్లకి పైగా షేర్ సాధించింది. శాటిలైట్ హక్కులు అవన్నీ కలుపుకుంటే మూడొందలు అనేస్కోచ్చు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం కి డబ్బింగ్ చేస్తే హిందీ లో రేంజ్ ఇలా ఉంది. అలాంటి టైం లో రోబో 2 కి ఎనభై కోట్లు అసలు విషయమా ? సినిమా మీద నమ్మకం లేక శంకర్ అలా చేసాడు అంటున్నారు చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here