రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుక తరవాత ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలిసిన విషయమే. చలపతి రావు అనే సీనియర్ ఆర్టిస్ట్ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడడం దాన్ని స్టేజీ మీద ఉన్న యాంకర్ రవి సూపర్ సార్ అంటూ సమర్ధించడం అతి పెద్ద పాపం కింద కన్సిడర్ చేసారు మనవాళ్ళు. అయితే రవి మాత్రం ఇప్పటి వరకూ ఈ విషయం లో ఎక్కడా సారీ చెప్పనే లేదు. రవి వాదన ని తెగ తిడుతున్నారు కొంత మంది. ఒకప్పుడు రవి క్లోజ్ ఫ్రెండ్ ఐన లాస్య కూడా రవి కి ఈ విషయం లో పెద్ద షాక్ ఇచ్చేసింది.
అతని మీద విమర్శలు గుప్పిస్తూ యాంకర్ శశి వీడియో తీయగా దాన్ని ఆమె షేర్ చేస్తూ రవి బుద్ధి తెచ్చుకోవాలని కోరింది. ఈ వీడియోను లాస్య షేర్ చేస్తూ.. బాగా చెప్పావ్.. నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా అని వ్యాఖ్యానించడం విశేషం. దీన్ బట్టి చూస్తే వారిద్దరి మధ్యానా చాలా పెద్ద గొడవలే జరిగినట్టు అనిపిస్తోంది.