ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌కు వ‌చ్చి ఆ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..

భారీ అంచ‌నాల‌తో రానున్న ఆర్ఆర్ఆర్ మూవీ రోజురోజుకూ ఉత్కంఠ‌గా మారింది. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. విప్లవ వీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతోంది. భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరిగా రామ్‌చరణ్ కనిపించనున్నారు.

ఈ సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇండ‌స్ట్రీలో ఇదివ‌ర‌కు న‌మోదుకాని రికార్డుల‌న్నీ ఈ సినిమాతో సొంతం అవుతాయ‌ని ఫ్యాన్స్ టాక్‌. ఇప్పటికే విడుదలైన అల్లూరి, భీమ్ టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్ర యూనిట్‌ పూర్తి చేసింది. రీసెంట్‌గా స్టార్ట్‌ అయిన షెడ్యూల్‌లో యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్‌ ఆలియా భట్‌ జాయిన్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఆలియా తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా తెలియజేసింది. ఇందులో రామ్‌చరణ్‌ జోడీగా ఆలియా భట్‌ నటిస్తుంది. ఎన్టీఆర్‌ జోడీగా ఒలివియా మోరిస్‌ నటిస్తుంది. ఇంకా అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని, శ్రియా శరన్‌ సహా హాలీవుడ్‌ యాక్టర్స్‌ రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడి నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here