ట్రంప్ ఓడిపోతే భార్య‌లు వ‌దిలేస్తున్నారా..

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించ‌ని ప‌రిస్థితి ఎదురైంది. త‌న ప్ర‌త్య‌ర్థి జో బైడెన్ చేతిలో ఆయ‌న ప‌రాజ‌య‌మే చూశారు. దీంతో ఆయ‌న శ్వేత‌సౌధాన్ని వ‌దిలిపెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ఆయ‌న భార్య‌లు కూడా ఆయ‌న‌ను వీడ‌నున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్‌కు దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతున్న‌ట్లు అనిపిస్తోంది. శ్వేత‌సౌధాన్ని వీడ‌టంతో పాటు వివాహ బంధంతో కూడా తెగ‌తెంపులు చేసుకోవాల్సిన ప‌రిస్థితి వచ్చింది. ట్రంప్ మొద‌టి భార్య మెలానియా ట్రంప్‌తో విడాకులు ఇచ్చేందుకు ఎదురుచూస్తోంద‌ని స‌మాచారం. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం మేర‌కు ట్రంప్‌, మెలానియాల‌ది ఒప్పందం ప్ర‌కారం జ‌రిగిన వివాహం. వీరిద్ద‌రూ బ‌య‌ట‌కు క‌లిసే ఉన్న‌ట్లు క‌నిపించినా.. లోప‌ల మాత్రం వీరిద్ద‌రి మంచాలు కూడా స‌ప‌రేటుగానే ఉంటాయంట‌. అంతేకాకుండా ట్రంప్ ప‌ద‌వి దిగిపోయే రోజు కోసం ఆమె ఎదురుచూస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇక ట్రంప్ రెండో భార్య మార్లాతో జ‌రిగిన పెళ్లి కూడా ఒప్పందం ప్ర‌కారం జ‌రిగింద‌ట‌. ఆమె కూడా దీనికి సంబంధించిన ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు చెప్ప‌డానికి వీల్లేదంట‌. ఈ విష‌యాల‌ను ది డైలీ మెయిల్ యూకే అనే ప‌త్రిక ప్ర‌చురించింది. ‌ఈ నేపథ్యంలో మెలానియాతో ఏదో ఒప్పందం ఉండే ఉంటుందని, అందుకే ఆమె ఈ పరిస్థితుల్లో కూడా బయటకు ఏమీ మాట్లాడడం లేదని సందేహించింది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు ట్రంప్ మెలానియా చెయ్యి పట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఆమె ప్ర‌వ‌ర్త‌న కొంచెం స‌రిగ్గా అనిపించ‌లేదు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ట్రంప్‌, మెలానియా వివాహ బంధంపై ప‌లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here