ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎలా పుట్టిందన్న దానిపై ఇంతవరకు స్పష్టమైన ఆధారాలు లేవు. అందరూ ఇది చైనా దేశం నుంచి ఇతర దేశాలకు వ్యాపించిందని అంటున్నారు. మరి కొందరైతే ఇది గబ్బిలాల నుంచి వచ్చిందని చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నారు.
కాగా ఎడ్వర్డ్ జె. స్టీల్, ఎన్. చంద్ర విక్రమసింఘె నేతృత్వంలో శాస్త్రవేత్తల బృంధం ఒక సిద్దాంతాన్ని తెచ్చింది. వీరు కోవిడ్ 19తో పాటు, క్యాండిడా ఆరిస్ కారణంగా వచ్చిన ఫంగల్ వ్యాధిపై వీళ్లు పరిశోధనలు చేశారు. దీని ద్వారా వీళ్లు ఓ విషయాన్ని వెల్లడించారు. తోకచుక్కలు, ఉల్కల దూళి రేణువుల ద్వారా ఇవి అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చాయనడానికి ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నారు. 2019 అక్టోబర్ 11వ తేదీన ఈశాన్య చైనాపై ఒక ఉల్క పడిందని.. దీని ద్వారా కరోనా వైరస్ భూమి మీదకు వచ్చిందని చెబుతున్నారు.
అప్పట్లో ఒక పెద్ద అగ్నిగోళం కనిపించిందని.. అది వూహాన్‌కు 2 వేల కిలోమీటర్ల దూరంలో అగ్నిగోలం ఆ ప్రాంతంలో ఢీ కొట్టిందట. ఆ తర్వాత ఉల్క శకలాలు భూమిపైనే ఉండి వూహాన్‌పై పడినట్లు చెబుతున్నారు. ఆ తర్వాతనే కరోనా వైరస్ వ్యాపించింది అంటున్నారు. అయితే ఇది అంతరిక్షం నుంచి వచ్చిందని చెబుతున్న సిద్దాంతాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ కరోనా వైరస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందన్న స్పష్టమైన ఆధారాలు తెలియాలంటే ఇంకెన్నాళ్లు వేచి చూడాల్సి వస్తుందో మరి.