ఎవరినీ లెక్క చెయ్యని , ఎవరి మాట వినని నైజం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ది . కోర్టు నోటీసుల దగ్గర నుంచీ పోలీసుల వరకూ రామ్ గోపాల్ వర్మ ని భయపెట్టే సీన్ ఎవ్వరికీ లేదు. అయితే తన కొత్త సినిమా సర్కార్ 3 విడుదల కే కోర్టు ఎసరు పెట్టేలా ఉండడం తో వర్మ తప్పక తల వంచాల్సి వచ్చింది. పారితోషికం దగ్గర నుంచీ టైటిల్ క్రెడిట్స్ వరకూ తనకి అన్యాయం జరిగింది అంటూ నీలేష్ క్రికార్ అనే రైటర్ సర్కార్ 3 కి సంబంధించి కోర్టుకి వెళ్ళాడు. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు.. తప్పు వర్మదేనని తేల్చింది.
ప్రివ్యూ చూసిన అనంతరం వర్మకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. నీలేష్ కి టైటిల్స్ క్రెడిట్ ఇచ్చి అనుకున్నట్టుగా ఆరున్నర లక్షలు వెంటనే ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో తప్పకుండా కోర్టు చెప్పినమాట వినాల్సి వచ్చింది వర్మ. తప్పదుగా విడుదల ఆపేస్తారు గా లేదంటే.