ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ విధానలు నచ్చక ఉన్నపాటి కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా టిడిపిని వీడి అధికార పార్టీలో చేరుతున్నారు. ఇటీవల విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జగన్తో మాట్లాడి వైసీపీ బ్యాచ్లో చేరిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియని టిడిపి నేతలు ఎవరికి తోచించి వారు మాట్లాడుతున్నారు.
నెమ్మదిగా జారుకుంటున్న ఎమ్మెల్యేలను చూస్తే టిడిపికి నిద్ర పట్టడం లేదని తెలుస్తోంది. గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలు అయినా చివరకు ఎంత మంది మిగులుతారో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నడుస్తోంది. చంద్రబాబు విధానాలు నచ్చక జగన్ చెంతకు నేతలు చేరుతుంటే.. టిడిపి మాత్రం బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. కొందరు నేతలు కోట్ల రూపాయలకు ఆశపడి పార్టీ మారాడని చెబుతుంటే.. మరి కొందరేమో కేసుల భయంతో టిడిపిని వీడి వైసీపీలోకి జంప్ అవుతున్నారని చెబుతున్నారు.
జగన్కు దగ్గరవ్వడానికి గల కారణాలను గణేష్ క్లియర్గా చెప్పారు. వై.ఎస్ జగన్ సమర్థతతో ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గణేష్ ఇంత స్పష్టంగా చెప్పినా టిడిపి మాత్రం కేవలం జగన్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తుందన్నది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. మూడు రాజధానులతో పాటు రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైసీపీ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతోంది. దీంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న ప్రజలు వైసీపీ వైపే చూస్తున్నారు. ఇక నాయకులు కూడా ప్రజల మద్దతు ఎక్కడుంటే అక్కడే ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. ఇది నచ్చని ప్రతిపక్ష పార్టీ.. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఇష్టారీతిన మాట్లాడుతోంది.