భారీ ప్రజల మద్దతు కూడగట్టుకొని ఘన విజయం సాధించిన ఏపీ సీఎం వై.ఎస్ జగన్‌కు సొంత రాష్ట్రంలో ప్రతిపక్షం నుంచి మద్దతు లభించకపోయినా వివిధ వర్గాలు, మేధావుల నుంచి ప్రశ్నంశలు అందుతున్నాయి. తాజాగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ జగన్ నిర్ణయాలకు మద్దు తెలిపారు.
ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో విద్యుత్ మీటర్ల విషయంపై మాట్లాడారు. అప్పట్లో వై.ఎస్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నప్పుడే తాము మీటర్లు పెట్టాలని చెప్పామన్నారు. అయితే అది అప్పట్లో నెరవేరకపోయినా జగన్ దీన్ని చేస్తున్నారన్నారు. మోటర్లకు మీటర్లు ఉండటం వల్ల ఎంత విద్యుత్ ఖర్చవుతుందనే లెక్క తెలుస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు జే.పి తెలిపారు.
ఎంత విద్యుత్ వాడుతున్నామనే వివరాలు తెలిసినప్పుడే విద్యుత్ పొదుపు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమన్నారు. రాజధాని వికేంద్రీకరణను పూర్తిగా సమర్ధిస్తున్నట్లు చెప్పారు. కాగా జగన్‌కు జేపీ నుంచే కాకుండా గతంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి కూడా అభినందనలు వచ్చాయి. కరోనా నివారణకు జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ప్రశంశించారు. ఇక నాడు నేడు కార్యక్రమాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కొనియాడారు. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకపోయినప్పటికీ దేశంలో ప్రముఖలు మాత్రం సపోర్టు చేస్తూనే వస్తున్నారు.






