యంగ్ హీరో నిఖిల్ తాజాగా తన ప్రేయసి పల్లవిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలకు లోబడి కొంతమంది అతిథుల సమక్షంలో ఈ క్యూట్ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం షూటింగ్ లు లేక ఖాళీగా ఉన్న నిఖిల్ భార్యతో సంతోషంగా గడుపుతున్నాడు. తాజాగా నిఖిల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వీరి అన్యోన్యతకు అద్దం పడుతోంది.
గురువారం నిఖిల్ భార్య పల్లవి పుట్టినరోజు ఈ సందర్భంగా నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ‘నా ప్రియమైన భార్యకు హ్యాపీ బర్త్ డే. నువ్వు నా జీవితంలో ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుండి నా లైఫ్ అంతా ఆనందమయంగా ఉంది’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
ఇక కెరీర్ విషయానికొస్తే… నిఖిల్ చివరిగా ‘అర్జున్ సురవరంతో’ ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రస్తుతం ‘కార్తికేయ2′ చిత్రంతో పాటు ’18 పేజెస్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.