రజనీకాంత్.. బహుశా ఈ పేరు తెలియని సగటు ఇండియన్ సినీ ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక బస్ కండక్టర్ గా కెరీర్ ప్రారంభించి… సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజినీ జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా రజనీకి కోట్లాదిమంది అభిమానులున్నారు.
తాజాగా టీం ఇండియా మాజీ ఆటగాడు జవగల్ శ్రీనాథ్ రజనీకాంత్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఉన్న శ్రీనాథ్ ఇటీవల ఓ టాక్ షోలో రజినీ గురించి మాట్లాడుతూ… ‘ నాకెప్పుడు నిరుత్సాహంగా అనిపించినా… జీవితంలో ఒత్తిడిగా ఫీలైనా వెంటనే రజనీకాంత్ సినిమాలు చూస్తాను. రజనీ గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆయన సొంతం’ అని చెప్పుకొచ్చాడు శ్రీనాథ్.