బాలీవుడ్ అంటే ఎవరికీ మాత్రం మోజు ఉండదు చెప్పండి ? ఇక్కడ సినిమాల పారితోషికం దగ్గర నుంచీ మేకింగ్ వరకూ ఫుల్లుగా డబ్బులు వచ్చి చేతిలో పడుతూ ఉంటె పండగ చేసుకుంటున్నారు ఒక్కొక్కరూ. అయితే ఇప్పుడు క్రికెటర్ ల కన్ను కూడా బాలీవుడ్ మీదనే ఉంది. ఐపీఎల్ దెబ్బతో ఇంటర్నేషనల్ ప్లేయర్ లు అందరూ మన గల్లీ క్రికెట్ ప్రేక్షకులకి బాగా దగ్గర అవ్వడం తో వారిని పెట్టుకుని సినిమాకి హైప్ తెచ్చుకోవాలి అని చూస్తున్న ప్రొడ్యూసర్ లు ఎందఱో. దాన్నే అదనుగా చేసుకుని డబ్బులు వెనక్కి వేసుకుందాం అనే క్రికెటర్ లు కూడా ఉన్నారు.
కరేబియన్ వీరులు ఎక్కువగా సినిమా పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు. డ్వేన్ బ్రావో ఇప్పటికే బాలీవుడ్‌తో అత్యంత సన్నిహితంగా మెలగుతుండగా… అతడి బాటలోనే వెస్టిండిస్ క్రికెటర్ అండ్రూ రస్సెల్ కూడా వచ్చి చేరాడు. త్వరలో ఒక మ్యూజిక్ వీడియో ని విడుదల చేసి ఇంటర్నేషనల్ గా సూపర్ హిట్ అవ్వాలి అనేది రస్సెల్ ఆలోచన త్వరలో దాన్ని విడుదల చెయ్యబోతున్నాడు. ” ఆర్ట్స్ అంటే నాకు చిన్నతనం నుంచీ ఆసక్తి . ఈ ఏడాది నా ఇంటర్నేషనల్ మ్యూజిక్ విడియో విడుదల చెయ్యబోతున్నాను ” అన్నాడు అతను.