క‌రోనాపై డ‌బ్ల్యూహెచ్ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌..ఆల్‌రెడీ ఫాలో అవుతున్నఏపీ

క‌రోనా పై డ‌బ్ల్యూహెచ్ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఎవ్వ‌రూ వేచి చూడొద్ద‌ని తక్ష‌ణం మ‌న ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అభిప్రాయ‌పడింది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈమేర‌కు త‌గిన‌న్ని స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

రాష్ట్రంలో వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సర్కార్‌ క‌రోనా విష‌యంలో చాలా సీరియ‌స్‌గానే క‌నిపిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్ప‌టికే క‌రోనాపై అప్ర‌మ‌త్తంగా ఉండేట‌ట్లుగా జిల్లా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. న‌గ‌రాల నుంచి ప‌ట్ట‌ణాలు, గ్రామాల వ‌ర‌కు క‌రోనా విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. ఏపీలో వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో తాజాగా డ‌బ్ల్యూహెచ్ఓ చేసిన ప్ర‌క‌ట‌న రాష్ట్రంలో అంత ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయ‌ని డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రెయేస‌న్ అభిప్రాయ‌పడ్డారు. వ్యాక్సిన్ విష‌యంలో మంచి ఫ‌లితాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ..  కేసుల తీవ్ర‌త ఎక్కువ‌వుతోంద‌న్నారు. ఒక‌వేళ వ్యాక్సిన్ వ‌చ్చినా.. అంద‌రికీ పంపిణీ చేసే విధానం లేద‌ని  అత్య‌వ‌స‌ర విభాగాధిప‌తి మైక్ రేయాన్ చెప్పారు.  ప్ర‌స్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ పై దృష్టి పెట్టి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌పంచ దేశాల‌కు సూచించారు.

అయితే ఇప్ప‌టికే  ఏపీలో సీఎం జ‌గ‌న్ స్టేట్ కోవిడ్ హాస్పిట‌ల్స్‌, జిల్లా స్థాయి కోవిడ్ హాస్పిట‌ల్స్‌లో విజ‌య‌వంతంగా చికిత్స‌లు చేస్తున్నారు. ఇక అనంత‌పురం జిల్లాలో రాష్ట్ర స్థాయి కోవిడ్ కేర్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అన్ని వ‌స‌తులు ఉండేలా ముంద‌స్తుగానే ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతున్నారు. ఇక క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని క్షేత్ర స్థాయిలో ప్ర‌చారం చేయిస్తున్నారు. వ్యాక్సిన్ ఎప్పుడైనా రానీ మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాల‌ని డబ్ల్యూహెఓ చెప్పిన విష‌యంపై ముందునుంచీ జ‌గ‌న్ అదే వే లోనే వెళుతున్నార‌ని ఇక్క‌డే అర్థ‌మ‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here