డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్యంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు కాబట్టి సౌత్, నార్త్ లో ఉన్న క్రేజీ ఆర్టిస్ట్ లను ఈ చిత్రం కోసం తీసుకోవడానికి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం..

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని కూడా తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే తరువాత పారితోషికం కారణంగా విజయ్ తప్పుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది.’ ‘ఉప్పెన’ సినిమాలో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు .. ‘పుష్ప’ ను కూడా ఆ నిర్మాతలే రూపొందిస్తున్నారు కాబట్టి.. విజయ్ సేతుపతి ఈ పాన్ ఇండియా చిత్రంలో నిర్మాతలు తీసుకోవడం ఖాయం’ అని అంతా అనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి వారికి పెద్ద షాకే ఇచ్చాడు.

ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడానికి గల అసలు కారణాన్ని విజయ్ సేతుపతినే స్వయంగా వెల్లడించాడు.’ ‘పుష్ప’ చిత్రం నుండీ నేను తప్పుకున్న మాట నిజమే. దానికి కారణం అందరూ అనుకుంటున్నట్టు పారితోషికం తక్కువై కాదు. నేను ‘పుష్ప’ కంటే ముందు చాలా సినిమాలకు కమిట్ అయ్యాను. లాక్ డౌన్ వల్ల ఆ చిత్రాలతో పాటు ‘పుష్ప’ కు డేట్స్ అడ్జస్ట్ చెయ్యడం కుదర్లేదు. అందుకే తప్పుకున్నాను’ అంటూ విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here