గాలికి ముద్దుకృష్ణమనాయుడికి ఏకు మేకై కూర్చున్న వాణి విశ్వనాథ్

నైన్ టీస్ లో చిరంజీవితో స్టెప్పులేసి ఓ ఊపు ఊపేసిన వాణి విశ్వనాథ్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు రోజాపై పోటీ చేసేందుకు సిద్ధం ఉన్న‌ట్లు వాణి  ధీమా వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం టీడీపీ నేత‌లు వాణి విశ్వ‌నాథ్ తో సంప్ర‌దింపులు జ‌రిపారు. రోజాకు పోటీగా రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేర‌కు సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి సాక్షిగా టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు   ఓ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా వాణి మాట్లాడుతు  యాక్ట‌ర్ గా తెలుగు ప్ర‌జ‌లు త‌న‌ని ఎంత‌గానో ఆద‌రించార‌ని, వారి రుణం తీర్చుకునేందుకు పాలిటిక్స్ లోకి ఎంట‌ర‌వుతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు చంద్ర‌బాబు త‌న‌కంటే ఎంతో ఇష్ట‌మ‌ని, రాజ‌కీయాల్లో చంద్ర‌బాబే త‌న‌కు రోల్ మెడ‌ల్ అని ఓ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు. ఎవ‌రిపై పోటీ చేస్తార‌నే ప్ర‌శ్న‌ల‌కు అధినేత అవ‌కాశం ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తూరు వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజాపై పోటీ చేస్తాన‌ని అన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లే టీడీపీలో చిచ్చుపెట్టిన‌ట్లుగా వార్త‌లు వస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి  టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జ్‌గా గాలి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాను ఉండ‌గా  వాణి
రాజ‌కీయ‌ల్లోకి రాక‌ముందే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే సీటుకోసం ప్ర‌య‌త్నించ‌డంపై గాలి గుర్రుగా ఉన్నార‌ట‌. దీనిపై త‌న అనుచ‌రుల వ‌ద్ద వాపోయిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రి వాణికి ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారు. రోజాకు పోటీగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తారా..అలా పోటీ చేస్తే గాలి ముద్దుకృష్ణమనాయుడికి ఏ నియోజ‌క‌వ‌ర్గం  ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here