స‌మంత ఇంత బిజీ అవ్వడానికి కార‌ణం ఇదే..

సినీ రంగంలో దూసుకుపోతున్న స‌మంత త‌న క్రేజ్‌ను ఏమాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటోంది. ఇప్ప‌టికే అగ్ర హీరోయిన్ల జాబితాలో కొన‌సాగుతున్న ఈ అక్కినేని వారి కోడ‌లు ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డు సృష్టిస్తోంది. తెలుగు ఓటీటీ ఆహాలో సామ్‌ జామ్‌ అనే టాక్‌షోను సమంత అక్కినేని హోస్ట్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఒకవైపు పర్సనల్ లైఫ్‌ని.. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటుంది సమంత అక్కినేని. సిల్వర్‌ స్క్రీన్‌పై హీరోయిన్‌గా పీక్స్‌ చూసిన సామ్.. ఇప్పుడు వెబ్‌ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పటికే ‘ఆహా’ కోసం ‘సామ్ జామ్’ చేస్తున్న సమంత.. త్వరలో ‘ఫ్యామిలీ మేన్-2’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.

అమెజాన్ పాపులర్ సిరీస్ ‘ఫ్యామిలీ మేన్’ సీజన్-2 లో నెగటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు సమంత. ఇప్పటివరకు హీరోయిన్‌గా తన క్యూట్ పెర్ఫామెన్స్‌తో సందడి చేసిన సామ్.. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం తొలిసారి యాక్షన్‌ సీన్స్‌లోనూ చెలరేగిపోయిందట. ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ -2 కోసం సమంత పలు భాషల్లో సొంత డబ్బింగ్ చెప్పుకుంది. అలా సామ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘ద ఫ్యామిలీ మేన్-2’ ఈ నెల నుంచే స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తవకపోవడంతో జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ‘ద ఫ్యామిలీ మేన్’ పార్ట్ 2లో సమంత పాత్ర ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here