వేడి పుట్టిస్తున్న ఐస్ క్రీమ్ పాప

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వాలని కలలుగనే తెలుగమ్మాయిలలో తేజస్వి మడివాడ ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో కొందరు తెలుగమ్మాయిలు మాత్రమే నటులుగా నెట్టుకొస్తున్నారు. హీరోయిన్లుగా కాదు. ఒకవేళ హీరోయిన్ పాత్రలు చేసినా సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తున్నారు. ఒకవేళ హీరోయిన్లుగా మెరిసినా కొంతకాలం మాత్రమే. ప్రస్తుతం తెలుగులో టాప్ యాక్టర్ అవుతుంది అనుకున్న వారిలో తేజస్వి ముందు వరుసలో ఉంటుంది. ఈ భామ ఈ మధ్యే పరభాషా హీరోయిన్లను మించిపోయేలా తన లేత అందాలను ఆరబోస్తుంది.

సినీ యాక్టరుగా కంటే బిగ్ బాస్ రియాలిటీ షోతో కాంట్రవర్సీ బ్యూటీగా ఎక్కువ పాపులర్ అయింది తేజస్వి. అమ్మడు తెలుగు తెర పై ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమాతో హీరోయినుగా మారింది. ఇప్పటి వరకు చాలా సినిమాలలో మెరిసింది కానీ హీరోయినుగా మాత్రం కాదు. ఇప్పటి వరకు అదే ఆమె కెరీర్లో సోలో హీరోయినుగా చేసిన సినిమా. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ అవకాశం రాగానే టీవీ ప్రేక్షకులందరికి తేజస్వి బాగా దగ్గరైంది. బిగ్ బాస్ షోలో వివాదాలతో పాటు వయ్యారాలు ఒలకబోసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

ఇక బిగ్ బాస్ నుండి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుండి అమ్మడికి సినిమా ఆఫర్లు కరువయ్యాయి. అవకాశాలు వస్తాయో రావో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ రెచ్చిపోతుంది. కుర్రకారులో వేడి పుట్టించే ఫోటోషూట్లతో ఇన్స్టాగ్రామ్ షేక్ చేస్తోంది. బ్లూ కలర్ సూట్లో కూర్చున్న పోజు ఒకటి తాజాగా పోస్ట్ చేసింది. అంతే ఆ సూటులో అమ్మడు లోదుస్తులతో పాటు ఎద అందాలను కూడా ప్రదర్శనకు నిలిపింది. ఆ భంగిమలో తేజస్వి పరువాల సంపద చూసి నెటిజన్లలో సెగలు రేగుతున్నాయట. అమ్మడిలో హీరోయిన్ స్టఫ్ చాలా ఉందని.. ఇంస్టాగ్రామ్ లోనే ఇలా చెమటలు పట్టిస్తే మరి సినిమాలలో అయితే అందాల కుంపటి అంటిస్తుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బటన్స్ లేని లేత అందాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here