తిరిగి ప్రారంభం కానున్న విదేశీ విమాన సర్వీసులు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన విదేశీ విమాన స‌ర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం అమెరికా నుంచి, శనివారం ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పౌరవిమానయాన మంత్రి మంత్రి హర్దీప్ సింగ్‌ పూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని చెప్పారు.

ఇందులో భాగంగా నిత్యం ఢిల్లీ నుంచి నెవార్క్‌కు, వారంలో మూడు రోజులు ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు విమానాలు వెళ్లనున్నాయి. అదే విధంగా ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ ఢిల్లీ, బెంగళూరు, ముంబాయిల నుంచి పారిస్‌లకు జూలై 18 నుంచి ఆగస్ట్ 1 వరకు 28 విమానాలను తిప్పనుంది. ఇక భారత్ నుంచి ఎయిర్ ఇండియా అమెరికా, ఫ్రాన్స్‌ లకు సర్వీసులను అందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here