సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు షెడ్యూల్ మార్చేశాడు..

క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత అన్నీ త‌ల‌క్రిందులు అయ్యాయి. అనుకున్న‌ది ఒక్క‌టైతే జ‌రిగింది మ‌రొక‌టి అన్న చందంగా మారింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా త‌గ్గింద‌నుకుంటే మ‌ళ్లీ సెకండ్ వేవ్ మొద‌లైంది. ఈ ప్ర‌భావం సినిమాల‌పై ప‌డింది. అందుకే ప్రిన్స్ మ‌హేష్ షెడ్యూల్ మార్చేశాడు.

2020 సంవ‌త్స‌రంలో మ‌హ‌ష్ బాబు ఆరంభంలోనే హిట్ కొట్టారు. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ఆయ‌న‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత స‌ర్కారు వారి పాట సినిమాలో ఆయ‌న న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ అమెరికాలో జ‌ర‌గాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా అక్క‌డ ప‌రిస్థితి ఏమీ బాగోలేదు.

దీంతో ఇండియాలో చేయాల్సింది ఇక్క‌డ ఫినిష్ చేద్దామ‌ని షెడ్యూల్ మార్చుకున్నారు చిత్ర యూనిట్‌. కథ ప్రకారం ఈ సినిమా‌ను అధిక భాగం అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. పరశురామ్, అతని టీమ్ ఇప్పటికే అమెరికా వెళ్లి అక్కడ లొకేషన్స్ ఫైనల్ చేసి, వెనక్కి తిరిగి వచ్చారు. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలనుకున్నారు. అయితే వీసాల సమస్య కారణంగా షూటింగ్ మరికొంత కాలం వాయిదా పడింది.

తొలుత హైదరాబాద్‌లోనే చిత్రీకరణను ప్రారంభిస్తారట. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించి ఇక్కడ షూట్ చేయాల్సిన సీన్లను ముందుగా పూర్తి చేస్తారట. ఆ తర్వాత ఫిబ్రవరి లేదా మార్చిలో అమెరికా షెడ్యూల్‌ను ప్రారంభిస్తారట. వరుసగా 45 రోజులు అక్కడే షూటింగ్ జరుపుతారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here