ఐలవ్యూ అని శ్రీముఖి ప్రొపోజ్ చేస్తే వెన్నెల కిషోర్ ఏమన్నాడు

టాలీవుడ్ ప్రముఖ కమేడియన్ వెన్నెల కిశోర్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్టు చేశాడు. దానికి క్యాప్షన్ గా .. “మై కరేబియన్.. మై కామారెడ్డి” అంటూ జతచేశాడు. ఆ సందర్భంగా పోస్టు చేసిన ఫొటోలో పొలాల్లోని ఓ మామిడి చెట్టు కింద కర్రలతో తయారు చేసిన మంచెపై కిషోర్ కూర్చొని ఉండగా తీసిన పిక్ అది.

దీనికి యాంకర్ శ్రీముఖి “ఐ లవ్ యూ! నా కీపాడ్ నీ ట్వీట్స్‌ ని చూసినప్పుడు..ఈ పదాలు మాత్రమే టైప్ చేస్తున్నాయి!” అంటూ ట్వీట్ చేసింది. దీనికి సమాధానం ఇచ్చిన వెన్నెల కిశోర్.. సిగ్గుపడుతున్న ఎమోజీలు పెట్టి “నువ్వలా చెప్పినపుడు నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి, కానీ నో ప్రాబ్లమ్.. అవి చామన ఛాయలోనే ఉన్నాయి.” అంటూ కామెడీ సమాధానం ఇచ్చాడు. ఇది వారి అభిమానులను ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here