చంద్రబాబు చేసేదంతా శవ రాజకీయమే:గడికోట శ్రీకాంత్‌రెడ్డి

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌–19 వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వాలనే ఆలోచన చేయకుండా కరోనా వైరస్‌ నియంత్రణ కాకూడదు.. కేసులు పెరిగిపోవాలి. కరోనా బారినపడి ప్రజలంతా మృత్యువాతపడితే తనకు కలిసివస్తుందని నీచమైన ఆలోచన చేస్తూ హైదరాబాద్‌లో కూర్చొని ఆరోపణలు చేస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. .

గడికోట ఇంకా ఏం మాట్లాడారంటే..
దేశంలో ఏ రాష్ట్రం చేయని పరీక్షలు చేస్తున్నాం. నిన్న కూడా దాదాపు 10,500 టెస్టులు చేసిన రాష్ట్రం. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో. క్వారంటైన్ల ఏర్పాటు, మెడికల్‌ ఆఫీసర్లను రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ ఇవ్వడం, కోవిడ్‌ ఆస్పత్రుల్లో 835 స్పెషలిస్టుల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేయడం. ఆరోగ్య సేతులో ఇన్వాల్వ్‌ చేయించడం, కరోనాకు సంబంధించి వాట్సప్‌ నంబర్, స్మార్ట్‌ ఫోన్‌ లేని వారి కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు, టెలీ మెడిసిన్‌ 14410 టోల్‌ ఫ్రీ నంబర్, కష్టకాలంలో నెలకు మూడుసార్లు రేషన్‌ పంపిణీ ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రభుత్వం ముందుకెళ్తోంది.

కష్టకాలంలో కూడా జగనన్న విద్యా దీవెన, మత్స్యకార భరోసా, పెన్షన్లు డోర్‌ డెలివరీ వంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. ఇంత మంచి పరిపాలన చేస్తూ దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటున్న సీఎం వైయస్‌ జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు.

కరోనా పెరిగిపోవాలనే దుర్మార్గపు ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. లక్షల మంది కరోనా బారినపడి చనిపోవాలని కోరుకుంటున్న దుర్మార్గమైన నాయకుడు చంద్రబాబు. హైదరాబాద్‌లో కూర్చొని టైంపాస్‌ కాక ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాడు. లెటర్లు రాయడంలో రికార్డు సాధించాలని చూస్తున్నాడు. లెటర్లు రాయడంలో రికార్డు సాధించడం కాదు.. గతంలో అధికారంలో ఉండి ఎన్ని పథకాలు అమలు చేశావో వెనక్కు తిరిగి చూసుకో చంద్రబాబూ..

ఆరు నెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ చెప్పిన కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా అమలు చేసి, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ అమలు చేసి అందరి నోళ్లు మూయిస్తున్నాడు. కష్టకాలంలో కూడా ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రికార్డు సృష్టిస్తున్నాడు. చంద్రబాబు ప్రవేశపెట్టిన నాలుగు పథకాల పేర్లు చెప్పగలడా..? గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదు.

మనుషులు మాత్రం మానవత్వంతో ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు. నక్కలు, రాబందులు మాత్రమే శవాలు కోరుకుంటాయి. విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజలను రక్షణ చర్యలు చేపడితే జూమ్‌ యాప్‌ ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నాడు. విశాఖలో విద్వేషాలు రెచ్చగొట్టేలని చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెడుతున్నాడు.

పది నిమిషాల పబ్లిసిటీ కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు కుటుంబం తొక్కి చంపేసింది. సినీ ఫిల్మ్‌ కోసం తీసుకునే వీడియోలో 29 మందిని చంద్రబాబు చంపాడు. ఇంతమంది చావుకు కారణం అయ్యావు అంటే ఏం మాట్లావో గుర్తుచేసుకో చంద్రబాబూ.. కుంభమేళాలో మనుషులు చనిపోలేదా..? యాక్సిడెంట్లలో మనుషులు చనిపోలేదా..? అని దుర్మార్గంగా చంద్రబాబు మాట్లాడాడు.

విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటనకు ప్రభుత్వ ప్రమేయం లేకపోయినా మానవత్వంతో ఆలోచన చేసి బాధితులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకున్నాడు. కోటి రూపాయల ఆర్థికసాయం చేసిన సీఎం వైయస్‌ జగన్‌ నిజమైన నాయకుడు. ప్రజల ప్రాణాలకు విలువ ఇచ్చే ప్రభుత్వం, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేసే ప్రభుత్వం మాది’ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here