స్పైడర్ లో అ రెండు సీన్ లకీ వెంట్రుకలు నిక్క బొడుచుకుంటాయి ..

మురుగదాస్ – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న స్పైడర్ సినిమాకి అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి . ఒక స్పై డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ సీన్ ల విషయం లో సెన్సార్ బోర్డు నుంచి సమాచారం వస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు సీన్ లు ఈ సినిమాకి మెయిన్ హై లైట్ లు కాబోతున్నాయి అంటున్నారు. ఒకటి మనం ట్రైలర్ లో చూసిన పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చే సన్నివేశం . ఈ సీన్ కాకుండా మురుగదాస్ ట్రైలర్ లో సైతం చూపించకుండా ఓకే సీన్ ని దాచి ఉంచాడు అనీ దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి అనీ అంటున్నారు. ఈ కొత్త సీన్ లో మహేష్ పెర్ఫార్మెన్స్ తో పాటు సూర్య పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది అంటున్నారు . మురుగదాస్ పనితనం తెరమీద చక్కగా కనపడుతుంది అనీ టీం కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది అంటున్నారు.సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ రెండు సీన్ లకీ వెంట్రుకలు నిక్క బొడుచుకోవడం పక్కా అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here