మోహన్ బాబు మీద ఒక పాట .. మహానటి సినిమాకే హై లైట్

‘మహానటి’ టైటిల్ తో సావిత్రి జీవితచరిత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ ను కీర్తి సురేశ్ చేస్తుండగా, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. ఇక ఎస్వీఆర్ .. సావిత్రి మధ్య తండ్రీకూతుళ్ల అనుబంధం వుంది. తెరపై వాళ్లు పండించిన పాత్రలు ఎప్పటికీ ఆణిముత్యాలే .. జాతిరత్నాలే.
అందువలన ఎస్వీఆర్ పాత్ర కోసం మోహన్ బాబును తీసుకున్నారు. ‘మాయా బజార్’ లో ‘ఘటోత్కచుడు’గా ఎస్వీఆర్ పాడిన ‘వివాహభోజనంబు’ పాటను ఇప్పటికీ మరిచిపోలేం. ఎస్వీఆర్ గా మోహన్ బాబుపై ఆ పాటను చిత్రీకరించే ఆలోచనలో ఈ సినిమా టీమ్ వున్నట్టుగా సమాచారం. ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి ఆ పాటను మరింత అద్భుతంగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. అదే జరిగితే ఈ పాట .. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here