ఆ సినిమా చేస్తే చెప్పుతో కొట్టండి – హీరో సిద్దార్థ్

తాను మంచి సినిమాలను మాత్రమే చేయాలనుకుంటానని సినీ నటుడు సిద్ధార్థ్ తెలిపాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ మంచివేనని… చెత్త సినిమాతో మీ ముందుకు వస్తే చెప్పుతో కొట్టండి అని అన్నాడు. సిద్ధార్థ్, ఆండ్రియాల కాంబినేషన్లో తెరకెక్కిన ‘గృహం’ సినిమా రేపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ మాట్లాడుతూ, పైవిధంగా స్పందించాడు. ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్, కో-రైటర్ గా కూడా సిద్ధార్థ్ వ్యవహరించాడు.
ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ, కెరీర్ పరంగా తానెప్పుడూ కిందకు పడిపోలేదని, కేవలం బ్రేక్ మాత్రమే తీసుకున్నానని చెప్పాడు. తానెప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటానని తెలిపాడు. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని… వారి అభిరుచులకు అనుగుణంగానే తన సినిమాలు ఉంటాయని చెప్పాడు. మంచి సినిమాలను తీస్తేనే, ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపాడు. పదేళ్ల క్రితం ఒకటి, ఐదేళ్ల క్రితం ఒక ఘటన తన జీవితంలో జరిగాయని… అవి జరగకపోయుంటే ఏది తప్పో, ఏది ఒప్పో ఇప్పటికీ తనకు తెలిసుండేది కాదని అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here