‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో ఇండస్ట్రీని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇంటెన్సివ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి రెండు ఏళ్ళు గడుస్తున్నా అజయ్ తన తర్వాత చిత్రాన్ని ప్రకటించలేదు. అప్పట్లో తెలుగులో ఓ బడా హీరోతో ‘మహా సముద్రం’ అనే సినిమాను తెరకెక్కించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అనంతరం ఆ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఇదిలా ఉంటే తాజాగా అజయ్ భూపతి తన తర్వాతి చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన చేశాడు. తన నెక్స్ట్ ఫిలిం ‘మహా సముద్రం’అని.. ఇందులో హీరోగా శర్వానంద్ నటించనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఒక ఇంటెన్సివ్ ప్రేమకథతో తెరకెక్కనుందని, అభిమానుల అంచనాలను కచ్చితంగా అందుకుంటుందని అజయ్ చెప్పుకొచ్చాడు. ‘ఆర్ఎక్స్ 100’తో అలజడి సృష్టించిన అజయ్… ‘మహాసముద్రం’తో ఎలాంటి సునామి సృష్టిస్తాడో వేచి చూడాలి.
 
            