సుశాంత్ సింగ్ 7 సినిమా ఆఫర్స్ కోల్పోయాడు : సంజయ్ నిరుపమ్

ప్రముఖ బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై లోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణంపై సినీ ఇండస్ట్రీలో రకరకాలా వార్తలు వస్తున్నాయి. కెరీర్ లో ఆశించిన స్థాయికి ఎదగలేకపోతున్నాననే బాధతో అతడు ప్రాణం తీసుకున్నాడని కొందరు, బ్రేకప్స్ ఒక కారణమని మరికొందరు, బాలీవుడ్ పెద్దలు కొంతమంది సుశాంత్ ని తొక్కేశారని రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలో రాజకీయనాయకుడు సంజయ్ నిరుపమ్ ట్విట్టర్ లో ఈ విధంగా పోస్ట్ చేసారు “చిచోర్ విజయం తరువాత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 7 చిత్రాలకు సంతకం చేశారు. గత 6 నెలల్లో, అతను వాటన్నింటినీ కోల్పోయాడు. ఎందుకు? ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క క్రూరత్వం మరొక స్థాయిలో ఉంది. దీనివల్ల ప్రతిభావంతులైన నటుడు చంపబడ్డాడు”.

బాలీవుడ్లో క్రూరత్వం గురించి తన ఆలోచనలను ఈ విధంగా వ్యక్తం చేశాడు సంజయ్ నిరుపమ్ మరియు గత 6 నెలల్లో సుశాంత్ 7 చిత్రాలను కోల్పోయాడని ఆరోపించారు. నిన్న సుశాంత్ సింగ్ చివరి కర్మలకు కూడా ఆయన హాజరయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here