సమంత ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు.

తాజాగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు క్రేజీ హీరోయిన్ రష్మిక. హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటారు రష్మిక.

ఈ సందర్భంగా తనను నామినేట్ చేసినందుకు సమంతాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here