అంగ‌రంగ వైభ‌వంగా జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్స‌వాలు

మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జెమిని గ్రూప్, జెమిని రికార్డ్స్ పేరిటి మ్యూజిక్ కంపెనీ ప్రారంభం

భారతీయ సినీ పరిశ్రమలో జెమిని సంస్థది ఒక సువర్ణాధ్యాయం. వందల సినిమాల నిర్మాణం.. మరెందరో నటీనటులకు కెరీర్ ఇచ్చిన సంస్థ ఇది. జెమిని గ్రూపులో ఎన్నో సంస్థలు ఉన్నాయి. జెమిని ఫిల్మ్ సర్క్యూట్, జెమిని FX, జెమినీ స్టూడియోస్ లాంటి సహ సంస్థలు చాలానే ఉన్నాయి. 75 సంవత్సరాల చరిత్ర ఉన్న జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జెమెనీ సంస్థ‌ల సీఈఓ పీవిఆర్ మూర్తి గారి చేతుల మీదుగా ఘనంగా జ‌రిగాయి. డైమండ్ జూబ్లీ సందర్భంగా ప్రతిష్టాత్మక జెమిని గ్రూప్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెడుతుంది. జెమినీ రికార్డ్స్ లేబుల్ తో సంగీత ప్రపంచంలోకి అడుగు పెడుతుంది జెమిని సంస్థ. జెమినీ రికార్డ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ ను నిర్మించడమే కాకుండా.. సినిమాలకు కూడా పని చేయనున్నారు. సినిమా పాటలు ప్రొడ్యూస్ చేస్తుంది జెమినీ రికార్డ్స్. అడుగు పెట్టిన ప్రతి చోట తనకంటూ ప్రత్యేక చరిత్ర లిఖించుకున్న జెమిని.. మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా దిగ్విజయంగా కొనసాగాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here