హీరో విరాన్ ముత్తంశెట్టి, నికిత అరోరా ‘బతుకు బస్టాండ్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల..

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బతుకు బస్టాండ్ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బతుకు బస్టాండ్ హీరో విరాన్ ముత్తంశెట్టి అల్లు అర్జున్ కు స్వయానా బావమరిది. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. హీరో విరాన్, హీరోయిన్ నికిత అరోరా ఇద్దరు చాలా రొమాంటిక్ గా చేతులు పట్టుకుని కూర్చున్నారు. ఈ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ లో ‘బతుకు బస్టాండ్’ సినిమా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here