ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో జరిగిన అనేక సంఘటనల లోంచి ముఖ్యమనైన , సంచలనమైన రెండు సంఘటనల ని వివరిస్తూ ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల బాస్కర రావు. ” ఎన్టీఆర్ న్ని గద్దె దింపడం లో చంద్రబాబు విజయం సాధించారు కానీ మీరు ఫెయిల్ అయ్యారు ” అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడగగా ” ఇంట్లో తిన్న వాడికి ఇంటి వాసాలు లెక్క పెట్టడం చాలా తేలిక, బయట వ్యక్తులకి ఇది కుదరదు. వెన్ను పోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు ది.
నాకు అలాంటి అలవాటు లేదు. అలాంటి ఆపరేషన్ లు మనవలన అయ్యేది కాదు. జగత్ జంత్రీలు చేసే పనులు అన్నీ చంద్రబాబు చేస్తాడు. సామాన్యుల వలన అది జరగదు ” అని తెగేసి చెప్పారు అప్పట్లో ఎన్టీఆర్ ని దగ్గర నుంచి చూసిన నాదెండ్ల. తనను పదవి నుంచి దించాలని ఎన్టీఆర్ చూసినందునే, ఆయన్ను దించాలని తాను ప్రయత్నించానని చెప్పుకొచ్చారు.





