‘మోసగాళ్లు’ రివ్యూ

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్లు’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో విష్ణు సొంతంగా ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాపై ఆయన భారీ నమ్మకం పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను చైనీస్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రపంచంలో జరిగిన అతిపెద్ద స్కామ్‌ను చిత్ర యూనిట్ మనకు చూపించే ప్రయత్నం చేశారు.

మధ్య తరగతికి చెందిన ఓ కుర్రాడు, విడాకులు తీసుకునేందుకు రెడీగా ఉన్న అతడి సోదరి కలిసి మరొక వ్యక్తితో ఓ కంపెనీ స్టార్ట్ చేస్తారు.ఈ కంపెనీలో జరిగే మోసాలు క్రమంగా పెద్ద స్కామ్‌గా మారడం, వాటి గురించి ఇంటర్నెషనల్ ఫెడరెల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు తెలియడంతో, వారు ఇక్కడి పోలీసుల సాయం తీసుకుంటారు.

అయితే పోలీసులు మంచు విష్ణు, కాజల్ చేస్తున్న ఈ స్కామ్‌ను ఎలా బట్టబయలు చేశారు? అసలు ఈ స్కామ్ చేద్దామనే ఆలోచన ఎవరు ఇస్తారు? చివరకు మంచు విష్ణు, కాజల్ ఏమవుతారు? అనేది సినిమా కథ.

కాగా ఈ సినిమా కోసం తీసుకున్న కథ యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయం.అయితే దర్శకుడు ఇక్కడి వాడు కాకపోవడంతో, తెలుగు ఆడియెన్స్‌కు ఈ సినిమాను ఎలా కనెక్ట్ చేయాలా అనే అంశంపై ఇంకా వర్క్ చేస్తే బాగుండేది.అయితే ఈ సినిమాలో మేజర్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పాలి.

సినిమా మొత్తం డబ్బులు స్కామ్ చేయడం, దాన్ని ఎలివేట్ చేసే విధానాన్ని మాత్రమే చూపించడంతో సదరు ఆడియెన్స్‌కు ఈ సినిమా కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది.కానీ ఈ సినిమా స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై చిత్ర యూనిట్ పెట్టుకున్న ఆశలు నెరవేరాయని చెప్పాలి.ఈ సినిమాకు ఏకంగా రూ.50 కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టారా అనేది మనకు ఈ సినిమా చేస్తూ ఇట్టే అర్థమవుతుంది.ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్‌లు బాగా కలిసొచ్చాయి.

రేటింగ్: 3.25/5.0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here