మెగా అల్లుడికి కరోనా పరీక్షలు…

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు చిన్న పెద్ద అని తేడా లేదు. తగిన జాగ్రత్తలు తీసుకొని వారు ఎవరైనా సరే కరోనా భారిన పడాలసిందే. ఇంకా నేపథ్యంలోనే మెగాస్టార్ చిన్న అల్లుడు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇంకా ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్ లో అయన ఇలా చెప్పుకొచ్చారు.. ”నేను షూట్ ప్రారంభించినప్పటి నుండి ఒంటరిగా ఉన్నాను. తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అందులో నెగెటివ్ వచ్చింది. నా కుటుంబ సభ్యులను కలవడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. నా గురించి ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు! మీ ప్రేమ కలిగి ఉండటం నేను అదృష్టంగా భావిస్తున్న” అంటూ తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here