” మెగా ఫ్యామిలీ ని తీవ్రంగా అవమానిస్తున్నారు , ఒక్క అవార్డూ ఇవ్వలేదు “

నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు. గీతా ఆర్ట్స్ గ్రూప్ లో బన్నీ వాసు కీలక వ్యక్తిగా ఉన్నాడు. మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని అసహనం వ్యక్తం చేశాడు.
ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని చెప్పాడు. రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇది ముమ్మాటికీ మెగా ఫ్యామిలీని అవమానించడమేనని చెప్పాడు. చిరంజీవి ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని… అయినప్పటికీ, ఆవేదనను తట్టుకోలేక తాను ప్రశ్నిస్తున్నానని తెలిపాడు.
గతంలో మగధీర సినిమాకు కూడా అన్యాయం జరిగిందని… జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు లభించినా, రాష్ట్ర స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదని బన్నీ వాసు అన్నాడు. ఈ మూడేళ్ల అవార్డుల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని… చిరంజీవి కుటుంబానికి గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందని చెప్పాడు. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు 50 శాతం ఆదాయం మెగా ఫ్యామిలీ నుంచే వస్తోందని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here