‘‘ఛోలె మసాలా, బెండకాయ వేపుడు, ఎల్లో రైస్… మా పిల్లల గౌతమ్, సితారకు ఇష్టమైన ఫుడ్! వారానికి ఒక్కసారైనా పిల్లల మెనూలో ఇవి ఉండాల్సిందే’’ అని నమ్రతా మహేశ్ అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వాట్స్ ఇన్ యువర్ కిడ్స్ డబ్బా’ ఛాలెంజ్ ఒకటి నడుస్తోంది. అందులో భాగంగా తమ పిల్లలకు ఇష్టమైనవి ఏంటో చెప్పాలన్నమాట.
ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా నమ్రతను అక్షయ్‌కుమార్ శ్రీమతి ట్వింకిల్ ఖన్నా నామినేట్ చేశారు. ‘‘పిల్లలకు ఆరోగ్యకరమైన, సాధారణ భోజనం అందిస్తా. వంట చేసేటప్పుడు తప్పకుండా అనుసరించే మరో చిట్కా… ఒక స్ఫూన్ స్వచ్ఛమైన నెయ్యి లేదా కోల్డ్-ప్రెస్సెడ్ కోకోనట్ ఆయిల్ ఉపయోగించడం. చిన్నారుల చిన్ని బొజ్జల్లో సులభంగా జీర్ణమవుతుంది’’ అని నమ్రతా మహేశ్ అన్నారు.